* మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి హత్య
బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాజీ సైనికుడిపై కాల్పులు జరిపి చంపారు. వారు పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దారుణంగా కొట్టగా ఇద్దరు మరణించారు. (Men Beaten To Death) మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.45 గంటలకు కళ్యాణి గ్రామం సమీపంలో 55 ఏళ్ల మాజీ సైనికుడు, గతంలో సర్పంచ్‌గా పోటీ చేసిన బిజేంద్ర సింగ్‌పై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.కాగా, ఇది చూసిన స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక దుండగుడు కాల్పులు జరుపగా గ్రామస్తుడు అంకిత్ కుమార్ గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు మరింతగా రగిలిపోయారు. ముగ్గురిని దారుణంగా కొట్టారు.మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతులను 23 ఏళ్ల మిథిలేష్ కుమార్, 25 ఏళ్ల ఆదిత్య కుమార్‌గా గుర్తించారు. మూడో దుండగుడు అజిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
* భార్యని స్క్రూ డ్రైవర్‌తో పొడిచిన భర్త
టర్కీలో దారుణం జరిగింది. హోటల్ గదిలో ఓ బ్రిటీష్ పర్యటకుడు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు. ఇస్తాంబుల్ సమీపంలోని ఫాతిహ్ మెవ్‌లనాకపి జిల్లాలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.హోటల్ గదిలో అరుపులు వినడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తీసి చూడగా.. మహిళ మృతదేహం అతి కారాతకంగా పొడిచి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త గది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితున్ని ప్రశ్నించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యను తనే స్క్రూ డ్రైవర్‌తో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. తనకు డ్రగ్స్ ఇచ్చినందుకు ఇలా చేశానని పోలీసులకు చెప్పాడు. కానీ గదిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14న బ్రిటన్‌కు చెందిన భార్యభర్త ఇస్తాంబుల్‌కు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
* గంటల వ్యవధిలో మరో రైల్లో మంటలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా (Etawah) జిల్లాలో దిల్లీ నుంచి బిహార్ వెళ్తున్న దిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి. దిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్ (Vaishali Express)లోని ఎస్-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో.. మొత్తం 21 మందికి గాయాలయ్యాయి.ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎస్-6 కోచ్‌లోని మంటలను ఆర్పేశారని పోలీసులు తెలిపారు. 21 మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. గాయపడిన ప్రయాణికుల్లో 13 మందిని సైఫాయ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా, ఏడుగురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఒక ప్రయాణికుడిని డిశ్ఛార్జి చేసినట్లు వెల్లడించారు.అంతకుముందు.. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి బిహార్ వెళ్తున్న దిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-1 కోచ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 బోగీలు దగ్ధమయ్యాయి. ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపేశారు. అధికారులకు సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
* కోల్ మైన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
కోల్ మైన్ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం చైనా దేశంలోని ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయ భవనంలో చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులున్న భవనంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 25 మంది.. ఊపిరాడక చనిపోయారు. అలాగే మరికొంతమంది బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు.
* తల్లీ కూతుళ్లపై యాసిడ్ దాడి చేసిన యువకుడు
అయోధ్యలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న యువతి, ఆమె తల్లి ముఖాలపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం తరుణ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.యాసిడ్ ధాటికి ఇద్దరి కళ్లు బాగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. నిందితుడు దీపక్ పాండే అదే గ్రామంలో నివసిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్లాసులో యాసిడ్ తీసుకుని ఇంటి తలుపు వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. 22 ఏళ్ల కూతురు బట్టలు కుట్టుతుండగా 45 ఏళ్ల ఆమె తల్లి ఇంట్లో ఉంది. ఇంతలో నిందితుడు ఇద్దరిపై యాసిడ్ పోశాడు. యాసిడ్ కారణంగా వారి ముఖం బాగా కాలిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ కూతుళ్లను జిల్లా ఆస్పత్రి నుంచి దర్శన్‌నగర్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇద్దరినీ లక్నోకు రెఫర్ చేశారు. నిందితుడైన యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇది ఇలా ఉంటే.. పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక స్థితి సరిగా లేని యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. యువతి సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యారు. ఆ అమ్మాయి ఏడుస్తూనే కథంతా చెప్పింది. నిందితుడు అమౌనా నివాసి నీరజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ ఏరియాకు పశ్చిమాన ఉన్న ఒక గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో గ్రామానికి చెందిన నీరజ్ వచ్చి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతడిని చూడగానే నీరజ్ పారిపోయాడు.
* కేరళకు చెందిన నర్సు అప్పీల్‌ను తిరస్కరించిన యెమెన్ కోర్టు
కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు యెమెన్‌లో మరణశిక్ష విధించారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని పెట్టుకున్న అభ్యర్థనను ఆ దేశ సుప్రీంకోర్టు(Yemen court) తిరస్కరించింది. దేశ పౌరుడిని హత్య చేసినందుకు ఆ మలయాళీ నర్సుకు శిక్ష ఖరారైంది. ఈ విషయం గురించి ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం విన్నవించింది. నిమిషా ప్రియకు ఇప్పుడు కేవలం యెమెన్ దేశాధ్యక్షుడు మాత్రమే క్షమాభిక్ష పెట్టగలరని కేంద్రం తెలిపింది. యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రియ తల్లి ప్రేమ మేరీ అభ్యర్థన పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు వారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది.తలాల్ అబ్దో మహది అనే యెమెన్ జాతీయుడిని నిమిషా ప్రియ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె రిలీజ్ గురించి మహది కుటుంబంతో మాట్లాడేందుకు తల్లి సిద్దమైంది. మహది కుటుంబానికి డబ్బులు చెల్లించేందుకు ప్రియా తల్లి రెఢీగా ఉంది. కానీ యెమెన్ సుప్రీంకోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రియా భర్త, ఆమె కూతురు 2014లో ఇండియాకు రిటర్న్ వచ్చారు. కానీ ఉద్యోగం వల్ల ప్రియా వెనక్కి రాలేకపోయింది. అయితే ఉద్యోగం కోసం మహదితో కలిసి 2015లో క్లినిక్‌ను ఓపెన్ చేసింది. కానీ ఇద్దరి మధ్య కొన్నాళ్లకు గొడవ మొదలైంది. పాస్‌పోర్టును మహది లాగేసుకున్నాడు. దీంతో జూలై 25న మహదిని ప్రియా అనుకోకుండా చంపేసింది. ఈ కేసులో మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
👉 – Please join our whatsapp channel here –