DailyDose

జాతీయ పత్రికా దినోత్సవం

జాతీయ పత్రికా దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్ కౌన్సిళ్ళు ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. అనేక సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది. సాంకేతిక విప్లవంతో వార్తలు అందించే తీరు మారినది.

రేడియోలు పోయి టెలివిజన్లు వచ్చి సంఘటనలను కళ్ళ ముందుకు తెచ్చాయి. వార్తలను జరిగిన తర్వాత చూపించడం ఆగి , జరుగుతుండగానే ప్రత్యక్ష ప్రసారం చేయగలుగుతున్నాయి. న్యూస్ చానెళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నిమిషం ఒక కొత్త వార్తని అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లో వార్తలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఇన్ని రకాలుగా వార్తలు అందుకునే అవకాశము ఏర్పడినా వార్తలను అందుకుంటున్నా నేటికీ ప్రజలు వార్తల కోసం చివరిగా నమ్మేది వార్తాపత్రికలను మాత్రమే. అయితే పేపర్ వంటివి వచ్చాక అందరి కష్టాలను చెప్పుకునే స్వేఛ్చా వచ్చింది. ప్రస్తుతం మొత్తం ఆన్‌లైన్ రావడంతో ఏది జరిగినా నిమిషాల్లోనే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. దీంతో జనాలకు సైతం ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం చాలా ఈజీ అయింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z