Business

యాక్సిస్‌ బ్యాంక్‌ మణప్పురం ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ జరిమానా

యాక్సిస్‌ బ్యాంక్‌ మణప్పురం ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ జరిమానా

ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis bank), బంగారంపై రుణాలు ఇచ్చే మణప్పురం ఫైనాన్స్‌(Manappuram Finance)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝుళిపించింది. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. రుణాలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, కరెంట్ ఖాతాలకు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించకపోవడంపై యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.90.92 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.మణప్పురం ఫైనాన్స్‌కు సైతం రూ.42.78 లక్షలు ఆర్‌బీఐ జరిమానా విధించింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీకి సంబంధించిన ఆర్‌బీఐ జారీచేసిన నిబంధనలు పాటించకపోవడంతో ఈ పెనాల్టీ విధించినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు జారీ చేశామని, ఆపై సదరు కంపెనీ ఇచ్చిన సమాధానం పరిగణనలోకి తీసుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేవైసీ నిబంధనలు పాటించనందుకు ఆనంద్‌ రాఠి గ్లోబల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు రూ.20 లక్షలు పెనాల్టీ విధించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z