Devotional

అయోధ్యలో శ్రీరాముడితోపాటు యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు

అయోధ్యలో శ్రీరాముడితోపాటు యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడితోపాటు యమధర్మరాజుకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపావళి తర్వాత వచ్చే యమ ద్వితీయ తిథి నాడు భక్తిశ్రద్ధలతో యముడిని కొలుస్తున్నారు. తమకు దీర్ఘాయుష్షు ప్రసాదించమని కోరుకుంటున్నారు. ఇక్కడి సరయూ నది ఒడ్డున యమతారా ఘాట్‌ వద్ద యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా రద్దీ తక్కువే ఉన్నా.. కార్తిక శుక్ల పక్ష ద్వితీయ రోజు జరిగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. శని గ్రహ, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు కోసం యమదేవుడిని పూజిస్తారు. అయోధ్యాదేవి నుంచి పొందిన ఆశీర్వాదం ఆధారంగా.. యమధర్మరాజు ఇక్కడ కొలువుదీరాడని పురాణాలు చెబుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z