DailyDose

అత్యధికంగా ఉపయోగించే పాస్‌వర్డ్ ఇదే!

అత్యధికంగా ఉపయోగించే పాస్‌వర్డ్ ఇదే!

సైబర్‌ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్‌వర్డ్‌లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్‌వర్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్‌గా ఉపయోగిస్తున్నట్టు పాస్‌వర్డ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌ కంపెనీ ‘నార్డ్‌పాస్‌’ తాజా నివేదికలో పేర్కొంది. తమ లొకేషన్‌ను తెలిపే పాస్‌వర్డ్‌లను కూడా యూజర్లు ఉపయోగిస్తున్నారు.

ఈ జాబితాలో ‘ఇండియా@123’ అనేది జాబితాలో అన్నింటికంటే పైన ఉంది. అలాగే, ‘అడ్మిన్‌’ అన్న పాస్‌వర్డ్‌ను కూడా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ‘పాస్‌@123’, ‘పాస్‌వర్డ్‌@123’ అన్నవి కూడా చాలా కామన్‌గా కనిపిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని పాపులర్‌ పాస్‌వర్డ్‌లలో మూడోవంతు (31శాతం) ‘123456789’, ‘12345’, ‘00000’ వంటి పూర్తి నంబర్లు కలిగినవేనని తెలిపింది. నివేదిక ప్రకారం ప్రపంచంలోని 70 శాతం పాస్‌వర్డ్‌లను సెకనులోపే తెలుసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z