రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 16న ఓ కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రయాణీకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెంచడానికి రాబోయే 4,5ఏళ్లలో సుమారు 3వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడం మంత్రిత్వ శాఖ ముఖ్య లక్ష్యమని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేలు ఏటా 800 కోట్ల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయని, జనాభా పెరుగుతున్న కొద్దీ నాలుగు నుంచి ఐదేళ్లలో సామర్థ్యాన్ని వెయ్యి కోట్లకు పెంచాలని వైష్ణవ్ దేశ రాజధానిలోని రైల్ భవన్‌లో మీడియాతో అన్నారు.
ఇందు కోసం, తమకు 3వేల అదనపు రైళ్లు అవసరం. ఇవి పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అనేక ట్రిప్పులు చేస్తాయని రైల్వే మంత్రి వైష్ణవ్ చెప్పారు. రైల్వే వర్గాల ప్రకారం, 69వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5వేల కొత్త కోచ్‌లను తయారు చేస్తోంది. ఈ అన్ని ప్రయత్నాలతో రైల్వేలు ప్రతి సంవత్సరం 200 – 250 కొత్త రైళ్లను జోడించగలవని, ఇవి 400 – 450 వందే భారత్ రైళ్లతో పాటు రానున్న సంవత్సరాల్లో వీటిని ప్రవేశపెట్టబోతున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రయాణ సమయాన్ని తగ్గించడం మరో లక్ష్యమని, దీని కోసం రైళ్ల వేగాన్ని మెరుగుపరచడానికి, రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైళ్లను వేగవంతం చేయడానికి, వేగాన్ని తగ్గించడానికి పట్టే సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం, ఎందుకంటే షెడ్యూల్ చేసిన స్టాపేజ్‌లతో పాటు, మార్గంలో అనేక హెచ్చరికలు, వంపుల వద్ద దాని వేగాన్ని తగ్గించవలసి ఉంటుందిని అన్నారాయన.
छठ पर्व में घर जाने वाले यात्रियों के लिए स्टेशन पर व्यवस्था देखी।
आज, अभी तक, 1 लाख लोगों को ट्रेन के माध्यम से Delhi area से बिहार, झारखंड और eastern region के लिए रवाना किया जा चुका है।सभी को छठ महापर्व की ढेरों शुभकामनाएं। pic.twitter.com/huqrkeAqbm
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) November 16, 2023
👉 – Please join our whatsapp channel here –