* సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారడం చాలా సులభం
తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys Narayana Murthy) తాజాగా టెకీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువత వారంలో 70 గంటల పాటు పనిచేయాలని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగింది. ఇక తాజాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం చాలా తేలికని, స్టార్టప్‌ను నడపడం, వ్యాపారవేత్తగా మారడం చాలా శ్రమతో కూడుకున్నదని పేర్కొన్నారు.వ్యాపారాలను నిర్మించేందుకు రిస్క్ తీసుకునే యువ వ్యాపారవేత్తలకు బాసటగా నిలిచేలా సమాజంలో విస్తృతమైన మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. దశాబ్ధం కిందట ఊహకు సైతం అందని రీతిలో వినూత్న ఐడియాలతో ముందుకొస్తున్న ఔత్సాహిత వ్యాపారవేత్తల సంఖ్య పెరగడం చూశామని అన్నారు. ప్రస్తుత యువతరం ఎంతో ఆత్మవిశ్వాసంతో అంకితభావంతో ఉందని చెప్పారు. సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొనేందుకు నేటితరం వ్యాపారవేత్తలు ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. వ్యాపారంలో అడుగుపెట్టే యువతకు సమాజపరంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి కెరీర్లు స్ధిరత్వాన్ని అందిస్తాయని అయితే వ్యాపారం అందుకు భిన్నమైనదని ఇక్కడ సక్సెస్‌కు ఎలాంటి గ్యారంటీ లేదని అన్నారు. వినూత్న ఒరవడి, పురోగతికి బాటలు వేసే వ్యాపారరంగం కొంత రిస్క్‌తో కూడుకున్నదని నారాయణమూర్తి పేర్కొన్నారు.
* అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన చెరీ న్యూ ఎనర్జీ కార్
చైనాకు చెందిన చెరీ న్యూ ఎనర్జీ తన దేశీయ మార్కెట్లోకి కొత్త లిటిల్ యాంట్‌ను విడుదల చేసింది. దీని ధర 77,900 యువాన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 8.92 లక్షలుగా ఉంటుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర 82,900 యువాన్లు (సుమారు 9.49 లు). చెరీ న్యూ ఎనర్జీ అనేది చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చెరీ ఆటోమొబైల్ కంపెనీ లిమిటెడ్‌లో ఒక భాగం.చెర్రీ కొత్త లిటిల్ యాంట్ క్లాసిక్ లిటిల్ యాంట్ అప్‌డేట్ వర్షన్‌గా వచ్చింది. అయితే, రెండు వాహనాలను కలిపి విక్రయించనున్నారు. కొత్త లిటిల్ యాంట్ ఆకర్షణీయమైన రంగులను కలిగి ఉంది. ఇది ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, ఊదా, పీచు, కిత్తలి నీలం, తెలుపు, బూడిద రంగులతో సహా మొత్తం 7 రంగు షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.కొత్త లిటిల్ యాంట్‌లో రిఫ్రెష్ చేసిన డ్యాష్‌బోర్డ్, పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత ఆధునికంగా కనిపించే స్టీరింగ్ వీల్, సన్నగా ఉండే ఎయిర్ వెంట్‌లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, లెదర్ సీట్ అప్హోల్స్టరీ, హీటెడ్ సీట్లు, స్టీరింగ్ వీల్, పెద్ద LED లైట్లు ఉన్నాయి. మేకప్ మిర్రర్, PM2.5 ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇవి కాకుండా వాయిస్ కంట్రోల్, రిమోట్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, పాదచారుల హెచ్చరిక వ్యవస్థ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. చెర్రీ న్యూ లిటిల్ యాంట్ 3242 mm పొడవు, 1670 mm వెడల్పు, 1550 mm ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 2150 మిమీ,గ్రౌండ్ క్లియరెన్స్ 120 మిమీ. దీని టర్నింగ్ వ్యాసార్థం 4.55 మీటర్లు. బహుళ బ్యాటరీ ఎంపికలు.. ఇందులో అనేక బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీని 25.05 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ 251 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో, 28.86 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ, 29.23 kWh LFP బ్యాటరీ ప్యాక్ 301 కి.మీ. ఇవి కాకుండా, 40.3 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ ప్యాక్ 408 కి.మీ.లుగా ఉంది.
* ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ-5పై కసరత్తు
ఓపెన్ఏఐ గత ఏడాది రివల్యూషనరీ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని (ChatGPT 5) లాంఛ్ చేసినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్ధులు, ఆర్టిస్టులు, వృత్తి నిపుణులు, వీడియో క్రియేటర్స్, రచయితలు ఈ ఏఐ టూల్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఏఐ రాకతో జీవితం సౌకర్యవంతంగా మారిందని కొందరు చెబుతుంటే లేటెస్ట్ టెక్నాలజీతో పెను ముప్పు పొంచిఉందని మరికొందరు చెబుతున్నారు.ఇక ఏఐ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఈ టెక్నాలజీపై నియంత్రణ ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో సాం ఆల్ట్‌మన్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌లు నొక్కిచెప్పారు. అయితే ఏఐపై సాం ఆల్ట్‌మన్ తన వైఖరి మార్చుకున్నట్టు వెల్లడైంది. ఏఐపై ఇప్పటికిప్పుడు నియంత్రణ అవసరం లేదని ఆల్ట్‌మన్ యూటర్న్ తీసుకున్నారు. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ-5పై కసరత్తు సాగిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం చాట్‌జీపీటీ జీపీటీ-3.5, జీపీటీ-4పై రన్ అవుతోంది. ఓపెన్ఏఐ ఇటీవల చాట్‌జీపీటీ-4 టర్బోను ప్రవేశపెట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సదస్సులో ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ రాబోయే సంవత్సరాల్లో మనం పురోగతి సాధించాలంటే టెక్నాలజీ అవసరమని చెప్పుకొచ్చారు. రాబోయే రెండు తరాల వరకూ ఏఐపై భారీ నియంత్రణలు అవసరం లేదని అన్నాఉన. ఓ కంపెనీ, దేశం, యావత్ ప్రపంచం అందించే ఉత్పత్తికి సమానమైన అవుట్‌పుట్‌ను ఏఐ మోడల్ నిర్వర్తిస్తే అప్పుడు కొంత ఉమ్మడి పర్యవేక్షణ అవసరమవుతుందని ఓపెన్ఏఐ సీఈవో చెప్పుకొచ్చారు.
* ఇదిగో మూడు మంచి మైలేజీని ఇచ్చే మూడు బైక్‌లు
బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు తరచుగా బైక్ ధర, దాని పనితీరు, డిజైన్‌పై శ్రద్ధ చూపుతారు. కానీ ఇది కాకుండా, మరొక ముఖ్యమైన విషయం ఉంది – అది మైలేజ్. అధిక మైలేజ్ ఉన్న బైక్ తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఇది పర్యావరణానికి తక్కువ హానిని కలిగిస్తుంది. మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. అందుచేత, మీరు తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉన్న బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మంచి మైలేజీని ఇచ్చే మూడు బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..స్ప్లెండర్ దాదాపు 30 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. నేటికీ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూనే ఉంది. ఇది ఇప్పటికీ బెస్ట్ సెల్లర్. బైక్ 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ 7.91 బిహెచ్‌పీ గరిష్ట శక్తిని, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 70 kmpl మైలేజీని ఇస్తుంది. అంటే దాని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ.హీరో కాకుండా, ఇంధన-సమర్థవంతమైన మోటార్‌సైకిల్ విభాగంలో బజాజ్ ఆటో కూడా ఉంది. బజాజ్ ప్లాటినా 100 అనేది ఇంధన సామర్థ్యం, మైలేజీ పరంగా గొప్ప ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్. ఇందులో 102 సీసీ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.79 బిహెచ్‌పీ, 8.30 ఎన్ఎమ్ ఇస్తుంది. ప్లాటినా 100 కూడా లీటరుకు దాదాపు 70 కిమీ మైలేజీని ఇస్తుంది.హోండా షైన్ 125 కూడా 100-110 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో మంచి పేరుగాంచింది. ఇది కొంచెం ప్రీమియం ఉత్పత్తి. ఇది 123.9 cc ఇంజన్ కలిగి ఉంది. ఇది 10.59 bhp, 11 Nm ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు దాదాపు 65 కి.మీ మైలేజీని ఇస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సాగాయి. వ్యక్తిగత రుణాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా టాప్ స్టాక్స్ 3.6 శాతం వరకూ నష్టపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా పతనం అయ్యాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 187.75 పాయింట్లు నష్టపోయి 65,794.73 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 33.40 పాయింట్ల పతనంతో 19731.80 పాయింట్ల వద్ద మగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.27 శాతం, స్మాల్ క్యాప్ 0.36 శాతం లబ్ధి పొందాయి. ఉదయం 65,788.79 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్.. అంతర్గత ట్రేడింగ్‌లో 66,037.69 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. 65,639.74 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 65,794.73 పాయింట్ల వద్ద ముగిసింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 19674.75 పాయింట్ల వద్ద మొదలై అంతర్గత ట్రేడింగ్‌లో 19,806-19667.45 పాయింట్ల మధ్య తచ్చాడింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 19,731.80 పాయింట్ల వద్ద నిలిచింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.27 వద్ద స్థిర పడింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.4 శాతం, నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా నష్టంతో ముగిశాయి. కేవలం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మాత్రమే ఒక శాతం పుంజుకున్నది.
* ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుందో ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం ఉత్తమం
ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు నిర్మించుకోవాలని ఉంటుంది. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఈ రోజుల్లో ప్లాన్ ప్రకారం వెళితే సాధ్యం కానిదంటూ ఏదీలేదు. ఒక ప్రణాళిక ప్రకారం వెళితే సొంతిళ్లు మీ సొంతమవుతుంది.ఈ రోజుల్లో బ్యాంకింగ్ రంగం విస్తరించడం వల్ల ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పోటీ పడి హోమ్‌లోన్స్ అందిస్తున్నాయి. అయితే ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుందో ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం ఉత్తమం. అలాంటి కొన్ని బ్యాంకుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై 8.40 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై 0.17 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇక హౌసింగ్ లోన్స్‌పై ఎస్‌బీఐ బ్యాంక్ వడ్డీపై 60 బేసిస్ పాయింట్ల తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 0.50 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇది గరిష్టంగా రూ. 25,000 వరకు ఉంటుంది. ఇక వడ్డీ రేట్లు కస్టమర్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. సిబిల్ స్కోర్ 750 పాయింట్స్ కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు 8.60 శాతంగా ఉంటుంది. సిబిల్ 750 కంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరుగుతుందని గుర్తుంచుకోండి.ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై 8,50 శాతం నుంచి 9.90 శాతం వరకు వడ్డీని వసూలుచేస్తోంది. హోమ్ లోన్స్ పై 0.23 శాతం ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటోంది. అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు పోటీగా ప్రైవేట్ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్స్‌ని 9 శాతం వడ్డీ రేటుకు అందిస్తోంది. సిబిల్ స్కోర్ 750 నుంచి 800 వరకు ఉన్న వారికే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇంతకంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంటుంది.
* గూగుల్ ఫొటోస్ సైతం మరిన్ని అధునాతన ఏఐ ఫీచర్లు
కృత్రిమ మేధతో టెక్నాలజీ రూపురేఖలే మారిపోతున్నాయి. రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక యాప్‌లలోనూ కంపెనీలు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు దాదాపు అందరూ ఉపయోగిస్తున్న గూగుల్ ఫొటోస్ (Google Photos) సైతం మరిన్ని అధునాతన ఏఐ పీచర్లను తీసుకొచ్చింది. అనేక తీపి గుర్తులు, జ్ఞాపకాలకు వేదికగా మారిన తమ యాప్‌ను వీటితో మరింత ఆకర్షణీయంగా మార్చినట్లు కంపెనీ తెలిపింది. మరి ఆ కొత్త ఫీచర్లేంటో చూద్దాం..ఒకే సందర్భం, లేదా ఒకే తరహా స్క్రీన్‌షాట్లతో మన గూగుల్ ఫొటోస్ (Google Photos) గ్యాలరీ నిండిపోతుంటుంది. దీనివల్ల మెమొరీ వృథా కావడంతో పాటు తీపి గుర్తులు, జ్ఞాపకాలను నెమరువేసుకోవడంలో ఇవి కొంత అడ్డుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒకే తరహా ఫొటోల్లో నుంచి మంచిదాన్ని ఎంచుకొని మిగిలిన వాటిని తొలగించేలా గూగుల్ ఫొటోస్ (Google Photos) తాజాగా ఓ కొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ఫొటో స్టాక్స్. ఈ టూల్ మన ఫొటోలలో ఒకే రకంగా ఉన్నవాటిని గుర్తించి ఒక దగ్గరకు చేర్చుతుంది. పైగా వాటిలో ఉన్న బెస్ట్ పిక్‌ను అదే సెలెక్ట్ చేసి చూపిస్తుంది. కావాలంటే మనమే మనకు నచ్చిన ఫొటోను బెస్ట్ పిక్‌గా ఎంచుకోవచ్చు. మిగిలిన వాటిని తొలగించుకోవచ్చు. లేదా అన్నీ ఒకే దగ్గర ఉండాలంటే అలాగే ఉంచుకోవచ్చు. ఒకవేళ అన్నీ గ్యాలరీలో కనిపించాలని మీరు భావిస్తే స్టాక్స్ ఫీచర్‌ను ఆఫ్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. స్క్రీన్‌షాట్లు కొన్ని సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఫొటోలను చూసుకునే సమయంలో ఇవి అడ్డనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లను గూగుల్ ఫొటోస్ (Google Photos) గ్యాలరీలో ప్రత్యేక ఆల్బమ్‌లా కనిపించే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అవసరమైనప్పుడు ఫొటోలన్నింటినీ స్క్రోల్ చేయకుండానే వీటిని సులభంగా కనిపెట్టొచ్చు. పైగా ఏదైనా స్క్రీన్‌షాట్, డాక్యుమెంట్‌కు రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు. తద్వారా మీకు అవసరం ఉన్న రోజు దాన్ని వెంటనే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లను 30 రోజుల తర్వాత అర్కైవ్ కూడా చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లకూ అందుబాటులోకి రానున్నాయి.
* ఇషా అంబానీకి ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె ‘ఇషా అంబానీ’తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్‌బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.’ఇషా అంబానీ’ యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్‌బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైంది.అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్‌లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు.
👉 – Please join our whatsapp channel here –