Politics

విజయశాంతికి కీలక పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

విజయశాంతికి కీలక పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను తాజాగా పార్టీలో చేరిన విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్‌, రాములు నాయక్‌, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్‌, రమేష్‌, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్‌, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, దీపక్‌ జాన్‌ను నియమించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z