భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ఈనెల 23న నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ల విక్రయం పూర్తి కాగా.. నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నారు. టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు.మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.600, 1,500, 2,000, 3,000, 5,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. త్వరితగతిన టికెట్లు దక్కించుకునేందుకు కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల వద్దే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలోకి చేరుకుని టికెట్లకు పోటీపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –