Devotional

తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమలలో పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. 2023, నవంబర్ 18వ తేదీ శనివారం వీకెండ్, కార్తీక మాసం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గత రెండు రోజులుగా తిరుమలకు భక్తులు క్యూకట్టారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భారీగా భక్తులు బారులు తీరారు.

స్వామి వారి దర్శనం కోసం దాదాపు 3 కిల్లో మీటర్ మేర భక్తులు క్యూలైన్ లలో వేచి వున్నారు. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారు 30 గంటలు సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడతావుంది. భక్తుల రద్ది మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం వుండడంతో టీటీడీ అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి వున్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చెయ్యడంతో పాటు పాలు, నీరు పంపిణీ చేస్తున్నారు.

మరో వైపు శుక్రవారం తిరుమల శ్రీవారిని 67,140 మంది దర్శించుకున్నారు. 26,870 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.దీంతో స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z