ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్(India vs Australia) తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ఆయన వీక్షిస్తే భారత్ ఓడిపోయే ప్రమాదం ఉంటుందన్నది వారి నమ్మకం. సెమీస్‌లో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం తర్వాత.. ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్(Amitabh Bachchan) ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు విస్తృతమైంది. దీంతో దయచేసి ఫైనల్ చూడొద్దంటూ ఆయన్ని అభిమానులు కోరుతున్నారు. జట్టు కోసం మరో త్యాగం చేయాలని చెబుతున్నారు. ఈ కామెంట్లపై స్పందించిన అమితాబ్.. ‘‘ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’’ అని మరోసారి ఎక్స్‌లో పోస్టు చేశారు. టీమ్‌ఇండియా ఆడేటప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్ పాటిస్తారని 2011లో ఆయన తనయుడు అభిషేక్ వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –