ప్రతిభ గల విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST) నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 17న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందజేయనున్నారు. మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఇంటర్ పూర్తి చేసే వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని భువనేశ్వరి సూచించారు. ఆసక్తి గల విద్యార్థినులు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చన్నారు.
👉 – Please join our whatsapp channel here –