DailyDose

ఎస్సై నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే

ఎస్సై నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే

ఏపీలో ఎస్సై నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు. బాధితుల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ప్రశ్నంచింది. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఆ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్సై నోటిఫికేషన్‌పై స్టే విధించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z