నవంబర్ 17న ఉదయం చికాగో ప్రయాణీకులతో వెళ్తున్న ఓ రైలు.. రైలు పరికరాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు, వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చికాగో ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, చికాగో ట్రాన్సిట్ అథారిటీ రైలు హోవార్డ్ CTA స్టేషన్ సమీపంలో నగరం నార్త్ సైడ్‌లో ఉదయం 10.35 గంటలకు మంచు-తొలగింపు పరికరాలపైకి దూసుకెళ్లింది.
31 మంది ప్రయాణికులు, ఏడుగురు CTA కార్మికులతో ప్రయాణిస్తున్న ఎల్లో లైన్ రైలు స్కోకీ నుంచి సౌత్‌బౌండ్‌లో ఉండగా అది నెమ్మదిగా కదులుతున్న రైలు పరికరాలను ఢీకొట్టిందని చికాగో ఫైర్ డిపార్ట్‌మెంట్ రెండవ జిల్లా చీఫ్ రాబర్ట్ జురేవిచ్ చెప్పారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 38 మంది గాయపడ్డారు. ఇరవై మూడు మందిని ఏరియా ఆసుపత్రులకు తీసుకెళ్లారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ ఎవరికీ ప్రాణాంతక గాయాలు కాలేదని అసిస్టెంట్ డిప్యూటీ చీఫ్ పారామెడిక్ కీత్ గ్రే చెప్పారు.
రైలు ఆపరేటర్ అత్యంత తీవ్రంగా గాయపడ్డారని చికాగో సన్ టైమ్స్ నివేదించింది. రైలులో ఉన్న మరో 15 మంది ఘటనా స్థలంలో వైద్య చికిత్సకు నిరాకరించారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై విచారణకు బృందాన్ని పంపుతున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ట్వీట్ చేసింది.
👉 – Please join our whatsapp channel here –