ఎస్‌బీఐ (SBI) డిజిటల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’ (Yono) సర్వీసులను మరో రెండు దేశాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. అమెరికా (USA), సింగపూర్ (Singapore) దేశాల్లో యోనో గ్లోబల్ (Yono Global) సర్వీసులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎస్‌బీఐ ఐటీ విభాగం డిప్యూటీ ఎండీ విద్య కృష్ణన్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలతోపాటు ఇతర బ్యాంకింగ్ ఆధారిత సేవలను ఆయా దేశాల్లోని వినియోగదారులు ఈ యాప్ ద్వారా పొందొచ్చు.
‘‘యోనో గ్లోబల్ యాప్ ద్వారా ఖాతాదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు పెట్టుబడులను కొనసాగిస్తున్నాం. సింగపూర్‌లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీల ద్వారా భారత్‌కు నగదు బదిలీ చేస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యోనో గ్లోబల్ సేవలను సింగపూర్, అమెరికాకు విస్తరిస్తున్నాం. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ సంస్థతోపాటు, సింగపూర్ మానిటరీ అథారిటీతో చర్చలు జరిపాం’’ అని విద్య కృష్ణన్ తెలిపారు.
ప్రస్తుతం ఎస్‌బీఐ యోనో గ్లోబల్ సర్వీసులు 9 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 2019లో బ్రిటన్‌లో ప్రారంభించిన ఈ సర్వీసులను క్రమంగా మారిషస్, కెనడా, బహ్రెయిన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లకు విస్తరించారు. ఎస్‌బీఐ విదేశీ నగదు కార్యకలాపాల విలువ 78 బిలియన్ డాలర్లు. సింగపూర్‌లో ఎస్‌బీఐ యోనో గ్లోబల్ యాప్‌ను పేనౌతో కలిసి ప్రారంభించనుంది. అమెరికాలో ముందుగా న్యూయార్క్, చికాగో నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది
👉 – Please join our whatsapp channel here –