NRI-NRT

అమెరికాలో పెంపుడు కుక్కలకు వింత వ్యాధి

అమెరికాలో పెంపుడు కుక్కలకు వింత వ్యాధి

అమెరికాలో పెంపుడు కుక్కలకు కారణం తెలియని శ్వాసకోశ వ్యాధి వస్తోంది. ఓరెగాన్‌ రాష్ట్రంలో ఆగస్టు మధ్యనాళ్ల నుంచి ఇప్పటివరకు 200 కేసులు వైద్యాధికారుల దృష్టికి వచ్చాయి. కొలరాడో, న్యూ హ్యాంప్‌షైర్‌ రాష్ట్రాల్లోనూ శునకాలు ఈ వ్యాధిబారిన పడ్డాయి. రోడ్‌ ఐలాండ్‌, మసాచుసెట్స్‌ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ తమ పరిశీలనకు శాంపిళ్లు వస్తున్నాయని న్యూ హ్యాంప్‌షైర్‌ విశ్వవిద్యాలయంలో పశు వైద్య పరిశోధకుడు డేవిడ్‌ నీడిల్‌ చెప్పారు. ఏడాది కాలంగా ఈ వ్యాధి తమ దృష్టికి వస్తోందన్నారు. దీనివల్ల శునకాలలో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కానప్పటికీ, పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్త పడాలని సూచించారు. దగ్గు, తుమ్ములు, ముక్కువెంట, కళ్ల నుంచి నీరు కారడం, బద్ధకం ఈ వ్యాధి లక్షణాలు. యాంటీబయాటిక్స్‌ పనిచేయడం లేదు. ఈ రుగ్మతలకు కారణాలేమిటో శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. సకాలంలో కుక్కలకు టీకాలు వేయించాలనీ, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే జంతు వైద్యుల వద్దకు వెళ్లాలని యజమానులకు అధికారులు సూచిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z