DailyDose

8 నుంచి అంగన్‌వాడీల సమ్మె

8 నుంచి అంగన్‌వాడీల సమ్మె

డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు డిసెంబరు 8 నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు కలిసి ఉమ్మడిగా సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు సమ్మె నోటీసును అందించగా.. ఈ నెల 20న జిల్లాల్లో పీడీలు, సీడీపీవోలకు నోటీసు ఇవ్వనున్నారు. 23న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25 నుంచి 30 వరకు సెక్టార్‌ సమావేశాలు నిర్వహిస్తారు. సమస్యల్ని పరిష్కరించాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు నిర్ణయించినట్టు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు.

ప్రధాన డిమాండ్లు ఇవీ..

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా వేతనం ఇవ్వాలి.

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ విధానాన్ని అంగన్‌వాడీలకు వర్తింపచేయాలి.

మినీ అంగన్‌వాడీ కార్యకర్తల్ని ప్రధాన కేంద్రాల కార్యకర్తలుగా గుర్తించాలి.

విధినిర్వహణలో చనిపోయిన వారికి రూ.5 లక్షలు పరిహారంగా చెల్లించాలి. బీమా సౌకర్యాన్ని వర్తింపచేసి ఇంట్లో ఒకరికి ఉద్యోగమివ్వాలి.

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z