ScienceAndTech

ఈసీ వెబ్‌సైట్‌లో ఓటర్ల కోసం మరో కొత్త ఫీచర్

ఈసీ వెబ్‌సైట్‌లో ఓటర్ల కోసం మరో కొత్త ఫీచర్

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. పోలింగ్‌ కేంద్రాలను, ఓటర్ల వివరాలను తెలుసుకునే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సరళతరం చేసింది. తన పోర్టల్‌లో పోలింగ్‌ బూత్‌ల వారీగా సమగ్ర అంశాలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి సాధారణ ఎన్నికలు-2023 ఎలక్టోరల్‌ రోల్స్‌లో జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. దీంతో ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు(Polling centres) ఉన్నాయో తెలిపే వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. దాని చెంతనే తెలుగు, ఆంగ్ల భాషల్లో గూగుల్‌ మ్యాప్‌ని నిక్షిప్తం చేశారు. అందులో ఓటరు ప్రారంభ సంఖ్య, చివరి సంఖ్య, పురుషులు, మహిళలు ఎంత మంది ఉన్నారు…. ఇలా బూత్‌ల వారీగా వివరాలు అందుబాటులో ఉంచారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z