NRI-NRT

స్పేస్ఎక్స్ రాకెట్ స్టార్‌షిప్‌ విజయవంతం

స్పేస్ఎక్స్ రాకెట్ స్టార్‌షిప్‌ విజయవంతం

టెక్‌ దిగ్గజం ‘స్పేస్‌ఎక్స్‌ (SpaceX)’ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘స్టార్‌షిప్‌ (Starship)’ భారీ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ఎగిసింది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం (నవంబరు 18) ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్‌ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ విఫలమైన విషయం తెలిసిందే. గాల్లోకి ఎగిరిన కేవలం 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఇది కూలిపోయింది. దీంతో తొలి ప్రయోగంలోని వైఫల్యాలను విశ్లేషించి.. రాకెట్‌, ల్యాంచ్‌ ప్యాండ్‌లను మరింత అభివృద్ధి చేసింది. అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (FAA) సూచించిన 57 మార్పులూ చేపట్టింది. ఎఫ్‌ఏఏ అనుమతి అనంతరం ఈ ప్రయోగం చేపట్టింది.

తాజా ప్రయోగంలో రాకెట్‌ గాల్లోకి ఎగిరిన 2.48 నిమిషాల తర్వాత బూస్టర్‌ విజయవంతంగా విడిపోయింది. దాదాపు గంటన్నర పాటు సాగనున్న ఈ టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభంలో విడిపోయే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా చర్యలు తీసుకున్నారు. స్పేస్‌క్రాఫ్ట్‌ మాత్రం భూమి చుట్టు దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయేలా తయారుచేశారు. రెండు సెక్షన్ల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌) ఈ ‘స్టార్‌షిప్‌ (Starship)’ రాకెట్‌ పొడవు ఏకంగా 121 మీటర్లు(400 అడుగులు) ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరుపొందిన దీన్ని.. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా ‘స్పేస్‌ఎక్స్‌ రూపొందించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z