సాంకేతికలోపం కారణంగా ఇటీవల యూకో బ్యాంక్ (UCO Bank)లో చోటుచేసుకున్న సంఘటనలకు దృష్టిలో ఉంచుకొని ఆర్థిక శాఖ బ్యాంకులను అలర్ట్ చేసింది. సైబర్ భద్రతను మరింత పటిష్ఠం చేయటం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU banks) చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బ్యాంకులు సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశిచింది. భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ బెదిరింపులపై బ్యాంకులు నిఘా ఉంచాలని సూచించింది. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక లోపాలు, సైబర్ భద్రత పటిష్ఠం వంటి అంశాల పట్ల ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ బ్యాంకులకు సూచనలు చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
గత వారంలో ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. నవంబర్ 10-13 తేదీల మధ్య ఐఎంపీఎస్ (IMPS)లో సాంకేతిక లోపం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. దీంతో బ్యాంక్ వెంటనే చర్యలు చేపట్టింది. ఇలా డబ్బులు జమ అయిన వారి ఖాతాలను బ్లాక్ చేసింది. ఆయా ఖాతాల నుంచి రూ. 649 కోట్లు రికవరీ చేసింది. ఇప్పటి వరకు 79 శాతం సొమ్ము వెనక్కి రప్పించినట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. అయితే, ఈ పొరపాటు మానవ తప్పిదమా? హ్యాకింగ్ ఏమైనా జరిగిందా? అనే దానిపై బ్యాంక్ స్పష్టత ఇవ్వలేదు.
👉 – Please join our whatsapp channel here –