అమెరికాలో జాతీయ సంస్థలు 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు ఏదో ఒక నగరంలో కన్వెన్షన్ నిర్వహిస్తారు, సంయుక్త రాష్ట్రాల నుంచి 15 వేలకు పైగా హాజరవుతారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) దివ్య దీపావళి అదే తరహాలో, కుదించిన కన్వెన్షన్ లాగా సాగింది. అన్ని అనుబంధ కార్యక్రమాలతో కలిపి 3 వేల మందికి పైగా హాజరైన తామా దివ్య దీపావళి స్థానిక డెన్మార్క్ హై స్కూల్ లో నవంబర్ 11న అంగరంగ వైభవంగా జరిగింది. ఉర్రూతలూగించిన మణి శర్మ మ్యూజికల్ నైట్, పిల్లలకు ఆర్ట్ పోటీలు, మంత్రముగ్ధులను గావించిన నాటికలు, నృత్యాలు, పాటలు, నృత్యనాటికలు, జబర్దస్త్ షో, మెడ్లీలు, విభిన్నమైన అంగళ్ళు, ఫ్యాషన్ షో, ఉచిత మెహందీ, సెలెబ్రిటీ మీట్ & గ్రీట్, పెద్దల ఆత్మీయ పలకరింపులు, పిల్లల పులకరింతలు, 2024 కొత్త జట్టు పరిచయం, యువత ఉత్సాహం, సముచిత సత్కారాలు, 2023 వాలంటీర్ అవార్డులు, తామా వార్షిక సంచిక (మ్యాగజైన్) ఆవిష్కరణ, సినిమా సెట్టింగుల తరహాలో పెద్ద డిజిటల్ స్క్రీన్, డెకొరేషన్, సౌండ్ క్లారిటీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్నాక్స్, టీ, పసందైన విందు భోజనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎస్ ఎస్ లెండింగ్ శివ వురే, అడ్డా స్పోర్ట్స్ పబ్ & ఈటరీ వేణు దండా, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ శ్రీనివాస్ లావు, రెడ్దిక్స్ లెండింగ్ రమేష్ బోధిరెడ్డి గోల్డ్ స్పాన్సర్స్ గా, టాప్ సిస్ ఐ టీ అభీ బద్దం, వేలా లైఫ్ ప్లాన్ వెంకట్ అడుసుమిల్లి, అట్లాంటా హైడ్రేషన్స్ రాజేష్ బొమ్మదేవర సిల్వర్ స్పాన్సర్స్ గా, ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ కరుణాకర్ ఆసిరెడ్డి, కానాప్ సిస్టమ్స్ కిరణ్ కనపర్తి, గిరీష్ మోడీ, ఎస్ కే ఐ టీ గిరిధర్ కోటగిరి, టి ఎస్ ఆర్ ప్రాపర్టీస్ త్రిపుర సుందర రెడ్డి, ట్రయో సాఫ్ట్ శ్రీనివాస్ దుర్గం, సన్ లైట్ టెక్నాలజీస్ శరత్ అనంతు, ఎవరెస్ట్ టెక్నాలజీస్ రవి కందిమళ్ల, భూమి రియల్టీ వెంకట్ నల్లూరి, ఫిన్ ఇన్వెస్ట్ అబర్న, ఇండస్ వ్యాలీ ఆర్గానిక్స్ అరుణ్ పారుపల్లి, ఈజీ ఇన్నోవేషన్ ప్రసాద్ వంగవోలు, ప్రవాసి సర్వీసెస్ అరుణ్, ప్రపూర్న్, మ్యాక్సిమమ్ వన్ రియల్టీ శేఖర్ పుట్ట బ్రోన్జ్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు. దీపావళికి మరియు సంవత్సరం పొడవునా అండగా నిలిచిన స్పాన్సర్లను, డాక్టర్లను, మనబడి టీం & టీచర్లను, విశిష్ఠ అతిధులను, కళాకారులను, మీడియా వారిని, మునుపు ప్రెసిడెంట్లను, ఛైర్మన్లను, వాలంటీర్లను (చాలా మంది పనుల వల్ల అందుబాటులో లేరు), స్థానిక మరియు జాతీయ సంస్థల నాయకులను సత్కరించుకోవడం ఒక విశిష్ట విషయం. తామా వారు సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం, పండుగలు, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, పిల్లల & యువత ప్రత్యేకాలు, భాష, ఆటలు, విద్య, వికాసం, వైద్యం, వినోదం, నాలెడ్జి బౌల్స్, ఆర్ట్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, నృత్యం, ఆరోగ్యం, ఐ టి, మహిళా సాధికారకత, నిధుల సేకరణ, క్విజ్, ట్యాక్సులు, ఫైనాన్స్, యోగా, ధ్యానం, ట్రైనింగులు వంటివి సమపాళ్ళలో రంగరిస్తూ చేస్తున్న అనేక కార్యక్రమాలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. సంవత్సరం పొడవునా జరిగే తామా వీక్లీ ఫ్రీ క్లినిక్, మనబడి తెలుగు తరగతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2023లో ఇది తామా వారి 26వ కార్యక్రమము. రాబోయే రోజుల్లో డిస్కవరీ ఫ్లైట్ (ఫస్ట్ ఫ్లైట్ ఫ్లయింగ్, ఎంతో మంది ‘వన్స్ మోర్’ అనడంతో మళ్ళీ చేస్తున్నాము), చెస్, యువత కార్యక్రమం, క్రిస్మస్ ఇలా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించండి లేదా info@tama.org కి ఇమెయిల్ చేయండి.
ముందుగా లిటిల్ స్టార్ ఆర్ట్ స్టూడియో హేమ తిరు సహకారంతో పిల్లలకు ఆర్ట్ పోటీలు అద్భుతంగా జరిగాయి. 100 మందికి పైగా పాల్గొన్న పిల్లలు దీపావళి థీమ్ లో రకరకాల బొమ్మలు వేసి ఆకట్టుకున్నారు, గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. తదుపరి మీట్ & గ్రీట్ లో భాగంగా సెలబ్రిటీస్ తో చాలామంది ఫోటోలు తీసుకున్నారు. సాంస్కృతిక కార్యదర్శి తిరు చిల్లపల్లి ఆహ్వానంతో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో దశావతారం, రామాయణ శబ్దం నృత్యనాటికలు, భువన విజయం నాటిక, సాంప్రదాయ ఫ్యాషన్ షో, ఫ్యూషన్ డ్యాన్స్ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ నవీన్ స్థానికులతో చేసిన షో హుషారుగా, సరదాగా సాగింది. తామా 2023 శ్రీనివాస్ రాయపురెడ్డి గారి సంస్మరణార్ధం ఇచ్చే ఉత్తమ వాలంటీర్ అవార్డు ఎంతో సేవ చేసిన మహేష్ కొప్పు కి ఇచ్చారు. అలానే, డాక్టర్ శ్రీహరి మాలింపాటి గారి సంస్మరణార్ధం ఇచ్చే ఉత్తమ క్లినిక్ వాలంటీర్ అవార్డు చిరంజీవి శ్రీనిజ పిసిపాటి కి ఇవ్వడం జరిగింది. యాంకర్ సినిమాపిచ్చ దిలీప్ హుషారుగా నడిపించారు. మణి శర్మ మ్యూజికల్ నైట్ సరే సరి, 3 గంటలపాటు జరిగిన కాన్సర్ట్ లో అన్నీ జోనర్స్ టచ్ చేస్తూ స్వరాగ్, వైష్ణవి, పవన్, శృతిక వీనుల విందుగా పాటలు పాడారు. హాలు కిక్కిరిసి పోవడంతో, చాలా మంది కింద కూర్చున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆద్యంతం డాన్సులు చేస్తూనే ఉన్నారు.
గౌరవనీయ అతిధులుగా విచ్చేసిన ఫుల్టన్ కౌంటీ స్కూల్ బోర్డు సభ్యురాలు లిల్లీ పోజాటెక్, జాన్స్ క్రీక్ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి, దిలీప్ తున్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, ఇంత మందిని ఒకే దగ్గర చూడటం ఆనందంగా ఉందని చెప్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటా నాయకులు కిరణ్ పాషం, కరుణాకర్ ఆసిరెడ్డి, అనిల్ బొద్దిరెడ్డి, శ్రీధర్, శ్రీరామ్ తదితరులు విచ్చేసి, అట్లాంటా లో జరిగే 2024 ఆటా కన్వెన్షన్ వివరాలు విపులీకరించారు. అలానే, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తామా వారు ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా, అత్యద్భుతంగా చేశారని ప్రశంసించారు. అలానే, స్పాన్సర్లు తామా తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని, భవిష్యత్తులో కూడా సహకారం అందజేస్తామన్నారు. వారందరికీ అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలానే, తామా కి మూల స్థంభాలు మీరు (ప్రజలు), స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు తామా జట్టు (1981 నుండి) అని చెప్తూ, ధన్యవాదాలు తెలియజేసి, 2024 అధ్యక్షులు సురేష్ బండారు ని సభకు పరిచయం చేశారు. సురేష్ కొత్త టీంని పరిచయం చేసి, అందరి సహాయ సహకారాలు కోరారు. ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి తామా చేసే ఫ్రీ క్లినిక్, సెమినార్లు, రక రకాల కార్యక్రమాల వివరాలు విపులీకరించారు. కొన్ని తిండి పదార్థాలు భారతదేశం నుండి కూడా తెప్పించడం జరిగింది. చివరగా కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణమైన స్పాన్సర్లకు, వాలంటీర్లకు, మణి శర్మ ట్రూప్ కి, విందు భోజనం అందజేసిన అడ్డా వారికి, చాట్ వాలా శ్రావణి తెనాలి కి, డెకరేషన్ వి & వి పావని గోడే, సౌమ్య పసుపులేటి, డిజిటల్ స్క్రీన్ బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర కి,వీడియో & ఫోటో వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ వాకిటి కి, సౌండ్ & ఇన్స్ట్రుమెంట్స్ మెహర్ చంటి కి, తామా టీంకి కృతజ్ఞతలు తెలిపి, ఘనంగా వీడ్కోలు పలికారు.
👉 – Please join our whatsapp channel here –