ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు నడుస్తున్నాయి. స్వాములు కఠిన నియమాలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నారు. ఇక మాల విరమణ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్తారనే విషయం తెలిసిందే. శబరిమలకు చేరుకునేందుకు భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత ఫ్లైట్‌లో వెళ్లినా కచ్చితంగా కొంత మార్గం మాత్రం అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఈ అడవిలో ప్రయాణించే మార్గంలో కొన్ని సందర్భాల్లో అపశృతులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అటవీ ప్రాంతం గుండా సాగే ఈ ప్రయాణంలో తాగునీటి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే వన్యప్రాణుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల తిరుమల కాలి నడక మార్గంలో పులి దాడికి సంబంధించిన సంఘటనలు అందరినీ ఉలిక్కిపడేలా చేసిన నేపథ్యంలో అయ్యప్ప స్వాముల కోసం అటవీశాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. అటవీ ప్రాంతంలో భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి ‘అయ్యన్’ పేరుతో యాప్‌ను రూపొందించారు అధికారులు.
అటవీ మార్గంగుండా ప్రయాణించే సమయంలో.. హెల్ప్ సెంటర్స్, హెల్త్ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్, తాగునీటి పాయింట్లతోపాటు మరిన్ని సేవలకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌ల పొందొచ్చు. అలాగే అధికారులతో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ యాప్ సేవలందిస్తుంది. ఇక ఈ యాప్‌ను తెలుగుతో పాటు.. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
వన్యప్రాణుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదననే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యాప్‌ను రూపొందించారు. తిరులమ తరహా ఘటనలు శబరిలో జరకూడదని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ యాప్‌ను రూపొందించిటన్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నడక మార్గంలో వెళ్తున్న సయంలో ఏవైనా జంతువులు దాడి చేసినా, మార్గ మధ్యంలో తారసపడినా వెంటనే అధకారులకు సమాచారం అందించడంతో పాటు సహాయం పొందొచ్చని చెబుతున్నారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను రూపొందించారు.
👉 – Please join our whatsapp channel here –