ScienceAndTech

డెస్క్​టాప్​లో స్క్రీన్​ షాట్​లు ఎలా తీయాలి?

డెస్క్​టాప్​లో స్క్రీన్​ షాట్​లు ఎలా తీయాలి?

లాప్​టాప్​ లేదా డెస్క్​టాప్​లో స్క్రీన్​ షాట్​లు ఎలా తీయాలి? అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కొత్తగా సిస్టమ్​ వాడే వాళ్లకి ఈ ప్రశ్న ఎదురవుతుంది. కానీ స్క్రీన్ షాట్ తీయడానికి బోలెడు పద్ధతులు ఉన్నాయి. షాట్​ కర్ట్ కీస్​ వాడి లేదా కాంబినేషన్ కీస్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. స్క్రీన్​ షాట్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ విండోస్​, మ్యాక్​ ఓఎస్​, లైనక్స్ వంటి వాటిలో స్క్రీన్​ షాట్ కోసం ప్రత్యేక యాప్ ఫీచర్ లేదా టూల్ అవసరం లేదు. వాటిలో ఇన్​బిల్ట్​గానే ఈ ప్రోగ్రామ్​ ఉంటుంది. కాబట్టి స్క్రీన్ షాట్స్ తీయడం చాలా ఈజీ.

విండోస్​..

* ల్యాప్​ టాప్ లేదా డెస్క్​టాప్​లో స్క్రీన్​ షాట్ తీయాలనుకుంటున్న యాప్ లేదా వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.

* విండోస్ లోగో+ షిఫ్ట్,+ఎస్ – ఈ మూడు కీస్​ కలిసి ఒకేసారి ప్రెస్​ చేయాలి. అప్పుడు స్క్రీన్​ డిమ్​ అవుతుంది.

* ఎంతవరకు స్క్రీన్​ షాట్ తీయాలో అంతవరకు మౌస్​తో సెలక్ట్ చేయాలి. అంతే.. మౌస్​ బటన్ వదిలేసిన వెంటనే
స్క్రీన్ షాట్​ నోటిఫికేషన్​ వస్తుంది.

* ఒకవేళ ఫుల్ స్క్రీన్​ని స్క్రీన్​ షాట్ తీయాలంటే పైన ఉన్న ఫుల్ స్క్రీన్​ స్నిప్​ ఆప్షన్ సెలక్ట్​ చేసుకోవాలి.

* స్నిప్పింగ్ టూల్​ నోటిఫికేషన్ మీద క్లిక్​ చేస్తే ఎడిట్, క్రాప్, ఎన్నోటేట్, షేర్ లేదా సేవ్​ స్క్రీన్ షాట్ అని
కనిపిస్తుంది. వాటిలో ఏది కావాలో దాన్ని క్లిక్ చేసి వాడొచ్చు.

మ్యాక్ ఓఎస్​

* ల్యాప్​టాప్​ లేదా డెస్క్​టాప్​లో ఏదైనా యాప్ లేదా వెబ్​సైట్​ని ఓపెన్ చేయాలి.

* షిఫ్ట్+ కమాండ్​+ 3 కీలను ఒకేసారి నొక్కితే స్క్రీన్​ మొత్తం క్యాప్చర్ అవుతుంది.

* షిఫ్ట్​+ కమాండ్​+4 నొక్కడం ద్వారా స్క్రీన్ ఎంత వరకు క్యాప్చర్ చేసుకోవాలనేది ఎంచుకోవచ్చు.

* క్యాప్చర్​ చేసిన దాన్ని చూడాలంటే డెస్క్​టాప్​లో లేటెస్ట్ స్క్రీన్​ షాట్స్​లో కనిపిస్తుంది. దాన్ని వేరే యాప్స్​లోకి షేర్
చేసుకోవచ్చు.

లైనక్స్​లో…

* మోడర్న్​​ లైనక్స్​ వాడేవాళ్లు ప్రింట్​ కీ నొక్కాలి.

* తర్వాత స్క్రీన్​ లేదా విండోని క్లిక్​ చేస్తే స్క్రీన్​ మొత్తం క్యాప్చర్ అవుతుంది.

* స్క్రీన్​లో కొంత భాగాన్ని మాత్రమే స్క్రీన్​ షాట్ తీయాలనుకుంటే అంతవరకు మౌస్​తో డ్రాగ్ చేసి సెలక్ట్​ చేయాలి. దాంతో సెలక్షన్​ చేసినంతవరకే క్యాప్చర్ అవుతుంది.

* పిక్చర్స్​లోకి వెళ్లి స్క్రీన్​ షాట్స్ ఆప్షన్ సెలక్ట్ చేస్తే క్యాప్చర్ చేసిన స్క్రీన్ కనిపిస్తుంది. లేదా కంట్రోల్+వి కీ లను నొక్కి వేరే ఏ యాప్​లో అయినా పేస్ట్ చేయొచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z