ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రినే హతమార్చాలనుకున్నాడో యువకుడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకొంది. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్(సీసీఎల్)లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని అమిత్ ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. ఆ పనికి కొంతమంది కిరాయి హంతకులను వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే బయట వెళ్లిన రామ్‌జీపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా కుమారుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.
👉 – Please join our whatsapp channel here –