Politics

వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు

వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బేగంపేటలోని వివేక్‌ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఐటీ తనిఖీలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z