Devotional

శ్రీ శైలంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీ శైలంలో పెరిగిన భక్తుల రద్దీ

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తికమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధుల్లో భక్తులు కార్తిక దీపారాధన చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z