భారత మహిళల జట్టు కెప్టెన్ సవితా పూనియా(Savita Punia) అరుదైన ఘనతకు చేరువైంది. ఎఫ్ఐహెచ్(FIH) ఏటా అందించే ‘గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్'(Goal Keeper Of The Year) అవార్డుకు వరుసగా మూడోసారి నామినేట్ అయింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ అవార్డు అందుకున్న సవితా ఈసారి విజేతగా నిలిస్తే హ్యాట్రిక్ సాధిస్తుంది.
‘వరుసగా రెండు సంవత్సరాలు నేను ఈ అవార్డు గెలుస్తానని, మళ్లీ మూడోసారి కూడా నామినేట్ అవుతానని అనుకోలేదు. నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు జట్టు సభ్యులకు ఇది చాలా గర్వకారణం’ అని సవితా తెలిపింది. వరుసగా 2021, 2022లో సవితా గోల్ కీపర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు అందుకుంది.
👉 – Please join our whatsapp channel here –