తెదేపా నేతల బృందం మంగళవారం దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం – 6, 7 అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనుంది. బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనుంది. దిల్లీకి వెళ్లే తెదేపా బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –