ఇంజనీరింగ్ స్టూడెంట్లకు తొమ్మిదిన్నరేండ్లుగా తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చరణ్ కుమార్ రాయచూర్, కార్యదర్శి కార్తీక్ గుండల హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
బీఆర్ ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే దానిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీటెక్ స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు స్కాలర్ షిప్ ను పెంచాలని, టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు.
👉 – Please join our whatsapp channel here –