టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన న్యూ గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్‌గా అపర్ణ గుప్తాను నియమించింది. కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్ధ్యాలను అపర్ణ గుప్తా పర్యవేక్షిస్తారు. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఆపై బెంగళూర్, నోయిడా లొకేషన్స్‌లో మైక్రోసాఫ్ట్ జీడీసీని విస్తరించింది.
యాప్ ఇన్నోవేషన్, డేటా, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్‌ఫ్రా, సెక్యూరిటీ వంటి నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు కూడా జీడీసీలో భాగంగా ఉన్నాయి. జీడీసీ చీఫ్‌గా అపర్ణా గుప్తా నియామకం మైక్రోసాఫ్ట్‌కు లాభిస్తుందని, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలపై ఆమెకు ఉన్న అవాగహన కస్టమర్లకు ఉపయోగపడుతుందని మైక్రోసాప్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అపర్ణ నియామకంతో ప్రపంచవ్యాప్తంగా తమ విజయాల పరంపర కొనసాగడంలో ఆమె నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పాతికేండ్లపైగా పరిశ్రమ అనుభవం, మైక్రోసాఫ్ట్‌లో సుదీర్ఘ కెరీర్‌తో తమ జీడీసీ టీంను ఆమె విజయాల బాటలో నడిపిస్తారనే విశ్వాసం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరీన్ కాస్టెల్లో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –