భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో డిసెంబర్ 23న భక్తులకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. బుధవారం నుంచి ఉత్తర ద్వార దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈవో ఎల్. రమాదేవి ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి ఆలయ వెబ్‌సైట్‌లో టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంచినట్లు ఈవో వెల్లడించారు.
వైకుంఠ ద్వారా దర్శనం కోసం రూ.2000, రూ.1000, రూ.500, రూ.250 విలువైన సెక్టార్ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రత్యక్షంగా ఉత్తర ద్వార దర్శనానికి రాలేని భక్తులు.. పరోక్ష సేవల కోసం https://bhadradritemple.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా రూ.2000, రూ.1000ల టికెట్లను 22న ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులు 13-12-2023 ఉదయం 11 గంటల నుంచి 23-12-2023 ఉదయం 5 గంటల వరకు దేవస్థాన తానీషా కల్యాణ మండపం (సీఆర్‌ఓ) కార్యాలయంలో ఒరిజినల్ టికెట్లు పొందవచ్చని ఈవో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –