మెటాకు చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్.. వాట్సప్ (Whatsapp) తన యాప్‌లో కొత్తగా మరో రెండు ఫీచర్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి ఇ-మెయిల్ ఒకటి కాగా.. మరొకటి ఏఐ అసిస్టెంట్. ఈ రెండు ఫీచర్లు ఎవరెవరికి అందుబాటులోకి వచ్చాయి? ఎలా పనిచేస్తాయి? ఎలా ఉపయోగపడతాయనేది ఇప్పుడు చూద్దాం..
ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ఇ-మెయిల్ ఐడీని తమ అకౌంట్‌కు జోడించొచ్చు. ఎప్పుడైనా యాప్ లాగిన్ సమయంలో ఎస్సెమ్మెస్ రాక ఇబ్బంది పడకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సెల్యులర్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకురాగా.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. ఇప్పటికీ వాట్సప్ అకౌంట్‌కు ఎస్సెమ్మెస్ మాత్రమే ప్రాథమిక వెరిఫికేషన్‌గా కొనసాగనుంది. ఇందుకోసం వాట్సప్ సెట్టింగ్స్‌లోని అకౌంట్ మెనూలోకి వెళ్లి ఇ-మెయిల్ అడ్రస్‌ను యాడ్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అవసరం అయినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వాట్సప్‌లో ఏఐ ఫీచర్లను తీసుకురానున్నట్లు మెటా ఇది వరకే ప్రకటించింది. అందుకు అనుగుణంగా వాట్సప్‌లో ఏఐ చాట్‌బాట్ ఫీచర్‌ను అమెరికాలోని కొందరు యూజర్లకు మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ రంగులతో కూడిన చాట్‌బాట్ బటన్ చాట్స్ సెక్షన్‌పైన దర్శనమిస్తోంది. ఈ చాట్‌బాట్ ఫీచర్‌తో ఏమేం చేయొచ్చన్న దానిపై పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. రియల్‌టైమ్ వెబ్ రిజల్ట్స్‌ను ఇది అందించనున్నట్లు తెలుస్తోంది. టెక్ట్స్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడానికీ ఉపయోగపడనుంది.
👉 – Please join our whatsapp channel here –