అమెరికా తెలుగు సంఘం(ఆటా) నాష్‌విల్ విభాగం ఆధ్వర్యంలో గురువారం నాడు దీపావళి వేడుకలు, అట్లాంటాలో నిర్వహిస్తున్న 2024 ఆటా మహాసభల నిర్వహణ నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. మిమిక్రీ రమేష్, గాయకులు జనార్దన్ పన్నెల, నూతన మోహన్ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అలరించాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డి, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, బీఓటీ అండ్ కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధిని, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, బీఓటీ అండ్ కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, కో-కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో-ఆర్డినేటర్ ప్రశీల్, కాన్ఫరెన్స్ సలహాదారు వెంకట్ వీరనేని తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు లక్షా50వేల డాలర్లకు నాష్‌విల్ బృందం హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఆటా వేడుకల కార్యక్రమాలను వివరించారు. నాష్‌విల్ ఆటా బృందం నుండి రామకృష్ణరెడ్డి, కిషోర్ గూడూరు, నరేందర్ నూకల, సుశీల చందా, రవి బంగారు, సాయి రామ్ రాచకొండ తదితరులు ఏర్పాట్లను సమన్వయపరిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z