ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. పౌర విమానయాన నిబంధనలను (CAR) ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. దిల్లీ, కోచి, బెంగళూరు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించామని డీజీసీఏ వెల్లడించింది
విమాన సర్వీసులు ఎటువంటి పరిస్థితుల్లో రద్దైనా, ఆలస్యమైనా, ఏదైనా కారణంచేత ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకున్నా.. విమానయాన సంస్థలు వారికి తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అలాగే, నిర్దిష్ట ప్రమాణాలు లేని సీట్లలో ప్రయాణించిన అంతర్జాతీయ బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు పరిహారం చెల్లింపుల్లో ఎయిరిండియా విఫలమైనట్లు తనిఖీల్లో గుర్తించామని డీజీసీఏ తెలిపింది. దీనిపై నవంబర్ 3న ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశామని, ఆ సంస్థ ఇచ్చిన సమాధానం అనంతరం రూ.10లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొంది. సీఏఆర్ పాటించనందుకు గతేడాది సైతం ఎయిరిండియా రూ.10 లక్షలు జరిమానా ఎదుర్కొంది.
👉 – Please join our whatsapp channel here –