* స్విగ్గీ జొమాటోలకు జీఎస్టీ నోటీసులు
ఇన్‌స్టంట్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ-జొమాటో కష్టాలు తీరడం లేదు. ఇటీవల స్విగ్గీ-జోమాటో రూ.500 కోట్ల జీఎస్టీ నోటీసును అందుకుంది. Swiggy-Zomato డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుండి కొంత డబ్బు వసూలు చేస్తుంది. ఇప్పుడు ఈ డబ్బుకు సంబంధించి ట్యాక్స్ ఆఫీసర్, ఫుడ్ డెలివరీ యాప్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ డెలివరీ ఫీజు విషయంలో దాదాపు రూ. 1000 కోట్ల వరకు వాటా ఉంది.‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్లే డెలివరీ ఏంజెట్లకు ఇచ్చే ఖర్చు తప్ప మరొకటి కాదని ఫుడ్ అగ్రిగేటర్లు Zomato మరియు Swiggy చెబుతున్నాయి. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుండి సేకరించి, డెలివరీ భాగస్వాములకు అందజేస్తాయి. అయితే దీనికి పన్ను అధికారులు ఏకీభవించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో రెండింటికీ సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల వాటా ఉంది. జొమాటో, స్విగ్గీకి GST అధికారుల నుండి ఒక్కో కంపెనీకి రూ. 500కోట్ల నోటీసులు అందాయి. స్విగ్గీ, జొమాటో ఈ డెలివరీ రుసుమును వసూలు చేసి తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయని పన్ను అధికారులు భావిస్తున్నారు.జొమాటో, స్విగ్గి తమ కస్టమర్‌లకు ఫుడ్ డెలివరీని అందించడం ప్రారంభించినప్పటి నుండి డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై 18శాతం పన్ను విధించినట్లు, ఆయా కంపెనీలు ఒక్కొక్కటి రూ. 500 కోట్లు చెల్లించాలని కోరినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. ఈ విషయమై ఎకనామిక్ టైమ్స్ స్విగ్గీ-జొమాటోను ప్రశ్నించగా.. వారి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
* యాపిల్‌లో పని పద్ధతులు తెలిసిన వ్యక్తి అయితే బావుంటుంది
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి తాను వైదొలగితే తర్వాత ఎవరు కంపెనీ పగ్గాలు చేపడతారనే విషయంలో సీఈవో టిమ్ కుక్ (Apple CEO) కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీకి చెందిన వ్యక్తే తన స్ధానంలోకి వస్తారన్న టిమ్ కుక్ ఆ వ్యక్తి ఎవరనేది వెల్లడించలేదు. యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి తాను ఎప్పుడు తప్పుకుంటాననే వివరాలను టిమ్ కుక్ ప్రస్తావించలేదు.12 ఏండ్ల నుంచి టిమ్ కుక్ యాపిల్ బిగ్ బాస్‌గా కొనసాగుతూ కంపెనీని నూతన శిఖరాలకు చేర్చారు. ఆయన సారధ్యంలో యాపిల్ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. గతంలో తాను పదేండ్లు సీఈవోగా ఉంటానని చెప్పిన కుక్ ఇప్పటికీ కంపెనీకి పెద్దదిక్కుగా ముందుండి నడిపిస్తున్నారు. భవిష్యత్‌లో తన తర్వాతి నాయకుడి విషయంలో యాపిల్ ఆలోచనల గురించి టిమ్ కుక్ ప్రస్తావిస్తూ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, అయితే తమ వద్ద సమగ్ర ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.తన స్ధానంలో సీఈవోగా బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నించగా, దీని కోసం పలువురిని సిద్ధం చేస్తున్నామని, అయితే తదుపరి బాస్ మాత్రం యాపిల్ నుంచే రావాలన్నది తన ఆలోచనగా టిమ్ కుక్ చెప్పారు. యాపిల్‌లో పని పద్ధతులు తెలిసిన వ్యక్తి అయితే బావుంటుందని వ్యాఖ్యానించారు. యాపిల్ సీఈవోగా తాను ఎంతకాలం కొనసాగుతాననేది చెప్పలేనని పేర్కొన్నారు.
* గూగుల్ పే యూజర్లకు కీలక హెచ్చరిక
డిజిటల్ చెల్లింపులు ఇటీవల కాలంలో క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. దీని కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఆర్థిక మోసాలకు పాల్పడే వారు ఏదో విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు దోపిడికి పాల్పడుతున్నట్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.Google Pay వాడుతున్న సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఓపెన్ చేసి ఉంచడం ద్వారా నేరగాళ్లు యూజర్ల Google Pay నుంచి ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, పిన్‌లతో సహా రహస్య వివరాలను క్యాప్చర్ చేసి డబ్బును దోచుకుంటున్నారు. కాబట్టి ఈ యాప్ వాడే సమయంలో ఎవరూ కూడా స్క్రీన్ షేరింగ్ యాప్‌ను వాడకూడదని గూగుల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.సాధరణంగా స్క్రీన్ షేరింగ్‌ను రిమోట్ వర్కింగ్ కోసం లేదా కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వేరే చోట నుంచి దాన్ని పరిష్కరించేందుకు వాడుతుంటారు. కానీ ఈ ఫీచర్ ద్వారా నేరగాళ్లు యూజర్ల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ సంఘటనల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన గూగుల్ తన యూజర్లకు పలు సూచనలు చేసింది.Google Pay ద్వారా జరిగే ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. యూజర్లు కూడా చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని అధికారిక యాప్‌లను మాత్రమే వాడాలని గూగుల్ తన యూజర్లకు పేర్కొంది.
* భారీగా తగ్గిన చికెన్ ధరలు
నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది.. ఈరోజు ధరలు ఎంతుందో ఒకసారి చూద్దాం..మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 170కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.. కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..
* నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. అలాగే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం అలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి.హైదరాబాద్: రూ. 966.వరంగల్: రూ. 974.విశాఖపట్నం: రూ. 912.విజయవాడ: రూ. 927.గుంటూరు: రూ. 944.
👉 – Please join our whatsapp channel here –