Politics

దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా!

దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా!

మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారని.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారని మంత్రి హరీష్​ రావు అన్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు గతంలో అసత్యాలు మాట్లాడారని.. ముక్కునేలకు రాస్తానని ఒకరు.. రాజీనామా చేస్తానని మరొకరు మాట్లాడారని.. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారని అంటూ హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ నాయకులవి అబద్దాలు ఆదరగొట్టే మాటలే ఉంటాయని.. కాంగ్రెస్ బండారం బట్టబయలు చేసింది నిర్మలాసీతారామన్ అని మంత్రి హరీష్​ రావు వివరించారు.

మోటార్లకు మీటర్లు పెట్టనందుకే కేంద్రం రూ. 25వేల కోట్లు ఆపిందని హరీష్​ రావు అన్నారు. 12 రాష్ట్రాల్లో మీటర్లు పెడుతున్నారని కేంద్ర చెప్పారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేకులని విమర్శించారు. కేంద్రం నుంచి రూ. 25వేల కోట్లు వస్తే తెలంగాణ అభివృద్ధి జరిగేదని తెలిపారు.

కేంద్రం నిధులు రాకపోయినా పర్వాలేదని.. రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ రైతుపక్షాన నిలబడ్డారని అన్నారు. దేశంలో రైతుపక్షపాతి ఒకే ఒక్కరు కేసీఆర్.. ఆయన పాలనలో రైతులు సురక్షితంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

జీడీపీలో కేంద్రం అప్పులు 57 శాతమని.. తెలంగాణ అప్పులు 28 శాతమేనని హరీష్​ రావు చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా అని నిలదీశారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి కార్మికులను ఆగం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని హరీష్ రావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z