ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. బెంగళూరు, హైదరాబాద్‌లలో తన రెండు కార్యాలయాలకు చెందిన ఆస్తులను విక్రయించాలని భావిస్తోందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. తన ప్రధానేతర స్థిరాస్తులను అమ్మడం ద్వారా వచ్చిన నగదును, కార్యకలాపాల స్థిరీకరణ కోసం వినియోగించాలని భావిస్తోందని ఆ కథనం తెలిపింది. హైబ్రిడ్ పని విధానం వల్ల కార్యాలయాల అవసరం తగ్గినందున, వేర్వేరు నగరాల్లోని కార్యకలాపాలను స్థిరీకరించడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో 14 ఎకరాలు, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న 25 ఎకరాలను విక్రయించేందుకు సంస్థ మదింపు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని విప్రో ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –