కృష్ణా జలాల పంపిణీ నూతన విధివిధానాల అంశంపై విచారణను ట్రిబ్యునల్ రెండు నెలలు వాయిదా వేసింది. బుధ, గురువారాల్లో విచారణ జరగాల్సి ఉండగా.. స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఫైల్ చేయాలని తెలుగు రాష్ట్రాలను ఇవాళ ఆదేశిస్తూ జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై ట్రిబ్యునల్ విచారణ చేయాల్సి ఉంది. అక్టోబరు 6వ తేదీన కేంద్రం జారీ చేసిన విధివిధానాలపై ఇరువర్గాల వాదనలు వింటూ విచారణ జరపాల్సి ఉంది.మరోవైపు కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. కేంద్ర గెజిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఈనెల 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –