Devotional

అలిపిరిలో 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం

అలిపిరిలో 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం

అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23 నుంచి ఉదయం 9 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని ప్రారంభించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) తెలిపారు. బుధవారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఆయన మీడియా స‌మావేశం నిర్వహించారు. ఇకపై ప్రతిరోజు నిరంతరాయంగా శ్రీవారి పాదాల వద్ద ఈ హోమం (Homam) నిర్వహిస్తామని వెల్లడించారు.

పెళ్లిరోజు, పుట్టిన రోజు , ఇతర విశేష రోజుల సందర్భంగా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చని తెలిపారు. రూ. వెయ్యి చెల్లించి గృహస్తులు ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్లు ఇస్తున్నామని , శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక స్లాట్ ల విధానంలో టికెట్ల సంఖ్య పెంచుతామని చెప్పారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు అందిస్తున్న ఆశీస్సులుగా ఈ హోమాన్ని చూడాలన్నారు . ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.

హోమ ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు వేద విద్యార్థులు, అధ్యాపకులు, కళా బృందాలతో వేద విశ్వవిద్యాలయం నుంచి ఊరేగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. పోస్టుల నియామ‌క ప్రక్రియ ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z