సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాలు చేశారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా ధర్మాసనం శుక్రవారం జరిపే విచారణ జాబితాలో రఘురామ పిటిషన్‌ను చేర్చింది. పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
👉 – Please join our whatsapp channel here –