డీప్‌ఫేక్‌పై భారాస శ్రేణులు, అభిమానులను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అప్రమత్తం చేశారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చన్నారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని.. భారాస సైనికులు అప్రమత్తంగా ఉండి ఓటర్లను ఇలాంటి వాటి విషయంలో చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు.
👉 – Please join our whatsapp channel here –