రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 27.5 మి.మీ. వర్షపాతం నమోదవ్వగా, మెదక్లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –