అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర (స్థానిక నామం దిహాంగ్) నదీతీరంలో శాస్త్రవేత్తలు ‘మ్యూజిక్ ఫ్రాగ్’ అనే కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఆడ, మగ కప్పలు రెండూ చప్పుడు చేస్తాయి. ‘‘ఈ కొత్తజాతి కప్పలు రెండు మూడు రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్ద వ్యవస్థను కలిగి ఉంటాయి. బ్రహ్మపుత్ర నదీతీరంలో మొదటిసారిగా వీటి చప్పుళ్లు విన్నాం. అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్న ఆ చప్పుడును గతంలో ఎప్పుడూ వినలేదు’’ అని సైన్స్ పత్రిక జూటాక్సాలో శాస్త్రవేత్తలు రాశారు. అరుణాచల్ రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తాము సర్వే నిర్వహించామని, ఆ సందర్భంగా ఈ కొత్తజాతి కప్పలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు బిటుపన్ బోరువా, వి.దీపక్, అభిజిత్ దాస్ తెలిపారు. 6 సెం.మీ. మేర పెరిగే ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీం రంగులో గీత ఉంటుందన్నారు.
👉 – Please join our whatsapp channel here –