ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన లభించింది. నవంబర్ 14న జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. గత పదమూడు సంవత్సరాలుగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలను పెంచే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డల్లాస్ నాట్స్ విభాగాన్ని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అభినందించారు.
స్థానిక సెయింట్ మేరీస్ చర్చ్ ఆవరణలో నిర్వహించిన 13వ నాట్స్ బాలల సంబరాల్లో శాస్త్రీయ నృత్యం, నాన్ క్లాసికల్ నృత్యం, శాస్త్రీయ సంగీతం, నాన్ క్లాసికల్ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, మరియు తెలుగు పదకేళి వంటి వివిధ విభాగాలలో బాలబాలికలకు పోటీలను నిర్వహించారు. 200 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభని ప్రదర్శించారు. ఈ పోటీల్లో ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన బాలబాలికలకు నాట్స్ నిర్వాహకులు బహుమతులు అందించారు.
డాలస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, శ్రీధర్ న్యాలమడుగుల, పార్ధ బొత్స, శ్రీనివాస్ ఉరవకొండ, శ్రీధర్ విన్నమూరి, సురేంద్ర ధూళిపాళ్ల, నాగిరెడ్డి మందల, గౌతమ్ కాసిరెడ్డి, వెంకట్, రాధిక, రవీంద్ర చిట్టూరి, యువ నిర్వాహకులు మనోజ్ఞ, గీతిక, మల్లిక, త్రినాథ్, ధృవ్, సాయి, నిత్య, రేహాన్, నిఖిత, యషిత, వరిశ్, మరియు నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, మాదాల రాజేంద్ర తదితరులు సహకారాన్ని అందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z