టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’(Devara). ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. దేవర సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 2000 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారట. కాగా.. ఈ పాటకు నాటు నాటు సాంగ్‌కు కొరియోగ్రఫి చేసిన ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చుతుండగా.. పాటకు సంబంధించిన ఓ భారీ సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో డిజైన్ చేశారని సమాచారం. ఈ సాంగ్‌కు సంబంధించి డిసెంబర్ 3 నుంచి షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఒక్క పాట కోసం ఇంత మంది డ్యాన్సర్లను తీసుకోవడం ఎన్టీఆర్ మూవీలో ఇదే ఫస్ట్ టైమ్. ఇక దేవర విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం మొదలు పెట్టింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ కానుందని ఇన్‌సైడ్ టాక్. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. దేవర ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –