Movies

‘కంగువా’ షూటింగ్‌లో గాయపడ్డ సూర్య

‘కంగువా’ షూటింగ్‌లో గాయపడ్డ సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. త‌మిళ స్టార్ దర్శకుడు శివ‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ షూటింగ్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్‌ కెమెరా వచ్చి మీద పడింది. దీంతో ప్రమాదవశాత్తు సూర్య భుజానికి గాయమైంది. ఇక షూటింగ్‌ ఆపేసిన యూనిట్‌ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

అయితే సూర్యకు మేజర్‌గా గాయాలు కాలేవని, ఓ వారం వరకు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్‌ చెప్పాడట. ఇక వారం తర్వాతే సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు కానుందని దర్శకుడు చెప్పాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z