చాట్‌జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది. 2033 నాటికి బ్రిటన్, అమెరికాలోని మూడో వంతు ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేస్తారని తాజా అధ్యయనం వెల్లడించింది. వారానికి నాలుగు పనిదినాలతో ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుకానుంది.
ఉద్యోగులకు తగినంత శారీరక, మానసిక విశ్రాంతి లభించడంతో పాటు ఈ విధానంతో ఉత్పాదకత కూడా పెరగనుంది. యూరప్‌లో తొలిసారిగా బెల్జియం ఎలాంటి వేతన కోతలు లేకుండా ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఐ రాకతో పలు దేశాల్లో వారానికి నాలుగు పని దినాల విధానం అమలవుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
వారానికి నాలుగు రోజుల పని పద్ధతితో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవడంతో పాటు పనిచేసే విధానం, జీవనశైలి సమూలంగా మారుతుందని అటానమీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. జీపీటీ-4 (డే వీక్) పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం ఉత్పాదకత, ఉపాధిపై ఏఐ ప్రభావం గురించి పరిశీలించింది. అమెరికా, బ్రిటన్‌లో పనిచేస్తున్న కోట్లాది ఉద్యోగుల ఉత్పాదకత, అవుట్‌పుట్ ఏమాత్రం తగ్గకుండా వారిని ఏఐ వారానికి నాలుగు పనిరోజుల వైపు మళ్లిస్తుందని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –