ScienceAndTech

టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థుల వర్క్ బుక్స్ తనిఖీలు

టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థుల వర్క్ బుక్స్ తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలల తనిఖీల పేరుతో ఇప్పటివరకు ఉపాధ్యాయులను హడలెత్తించిన ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. ఇప్పుడు వాట్సప్‌ వీడియో కాల్‌ తనిఖీలకు సిద్ధమయ్యారు. ఈనెల 27న సాయంత్రం 6.30గంటలకు వాట్సప్‌లో విద్యార్థుల ఇళ్లకు ఫోన్‌ చేసి నోటుబుక్స్‌, వర్క్‌ బుక్స్‌తోపాటు సమ్మెటివ్‌-1 పరీక్షకు సిలబస్‌ పూర్తి చేయడాన్ని పరిశీలిస్తానని, ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులందరికీ పంపించాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాట్సప్‌ వీడియో కాల్‌లో పిల్లల నోటుబుక్స్‌, వర్క్‌ బుక్స్‌ చూపించేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పరీక్షలకు సిలబస్‌ పూర్తికాని పరిస్థితి ఉండకూడదని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z