తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు సాయం పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీకి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పరిశీలించిన అధికారులు.. పాత పథకమే కావడంతో రైతు బంధు సాయం పంపిణీ చేసేందుకు అనుమతిచ్చారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమకానున్నాయి.
👉 – Please join our whatsapp channel here –