Business

హైదరాబాద్ నుండి ఏడు మార్గాల్లో వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ

హైదరాబాద్ నుండి ఏడు మార్గాల్లో వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ

తెలంగాణలో దూరప్రాంతాలకు వేగవంతమైన ప్రజారవాణా సదుపాయాల కల్పనపై భారాస తమ ప్రణాళికలువెల్లడించింది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గంటలో చేరుకునేలా ర్యాపిడ్‌ రైల్‌ ట్రాన్సిట్‌ కారిడార్లను ప్రతిపాదించింది. ఐటీ రంగాన్ని చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అంటున్నారు. శుక్రవారం ఆయన 2047 హైదరాబాద్‌ విజన్‌ ప్రజెంటేషన్‌లో ఈ కారిడార్ల గురించి వివరించారు. ఓఆర్‌ఆర్‌ వరకు మెట్రో.. అక్కడి నుంచి ర్యాపిడ్‌ రైల్‌ తీసుకొస్తామని చెప్పారు.

ప్రతిపాదిత కారిడార్లు

1. శామీర్‌పేట (ఓఆర్‌ఆర్‌)- గజ్వేల్‌- కొమరవెల్లి-సిద్దిపేట- కరీంనగర్‌ 140 కి.మీ.
2. ఘట్‌కేసర్‌ (ఓఆర్‌ఆర్‌) – బీబీనగర్‌, యాదాద్రి, జనగాం, రఘునాథపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌- వరంగల్‌ 113 కి.మీ.
3. పెద్ద అంబర్‌పేట(ఓఆర్‌ఆర్‌)
ఎ) చౌటుప్పల్‌, చిట్యాల్‌- నార్కట్‌పల్లి, నల్గొండ 81 కి.మీ.
బి) నార్కట్‌పల్లి, నరిరేకల్‌- సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం 111 కి.మీ.
4. శంషాబాద్‌ (ఓఆర్‌ఆర్‌)- షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ 50 కి.మీ.
5. అప్పా (ఓఆర్‌ఆర్‌)- మొయినాబాద్‌, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌ 60 కి.మీ.
6. ముత్తంగి(ఓఆర్‌ఆర్‌)- ఇస్నాపూర్‌, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ 64 కి.మీ.
7. కండ్లకోయ (ఓఆర్‌ఆర్‌)
ఎ) మేడ్చల్‌-మనోహరాబాద్‌, మాసాయిపేట, చేగుంట, మెదక్‌ 70 కి.మీ.
బి) చేగుంట-రామాయంపేట, బిక్‌నూర్‌, కామారెడ్డి, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ 103 కి.మీ.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z